Reading Time: < 1 minute

మాదాపూర్ మెడికవర్ దగ్గర అగ్ని ప్రమాదం.. చిమ్నీ పేలడంతో తెలుగు నెస్ రెస్టారెంట్ పూర్తిగా దగ్ధం

Caption of Image.

హైదరాబాద్​మాదాపూర్ మెడికవర్ హాస్పిటల్ పక్కన ఉన్న ‘తెలుగు నెస్’ రెస్టారెంట్ లో అగ్నిప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు చిమ్నీ పేలి మంటలు వ్యాపించాయి. దీంతో రెస్టారెంట్ కిచెన్ మొత్తం దగ్ధమైపోయింది. 

హోటల్ సిబ్బంది ఫిర్యాదుతో అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకు మంటలను అదుపులోకి తెచ్చారు. చిమ్నీని సకాలంలో శుభ్రం చేయకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు చెప్పారు. ఈ పేలుడు ధాటికి కిచెన్‌లోని వంట సామాగ్రి, ఇతర వస్తువులు దగ్ధం అయ్యాయి..

ప్రమాదం జరిగిన వెంటనే కిచెన్ నుండి పెద్ద ఎత్తున దట్టమైన  పొగలు అలుముకొన్నాయి. మంటలు, పొగలతో పరిసర ప్రాంతాల ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. అగ్నిమాపక సిబ్బంది​సకాలంలో స్పందించడంతో పెద్ద ప్రమాదం తప్పిందని.. అగ్ని మాపక అధికారులు వెల్లడించారు.

©️ VIL Media Pvt Ltd.