Reading Time: < 1 minute

‘ఈటల.. నీ ఏడుపే బీజేపీకి శాపం’…మేడ్చల్‌‌‌‌ లోని ఈటల రాజేందర్ ఇంటి వద్ద వివాదాస్పద ఫ్లెక్సీలు

Caption of Image.

మేడ్చల్, వెలుగు: బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌‌‌‌ను లక్ష్యంగా చేసుకుని మేడ్చల్‌‌‌‌లోని ఆయన నివాసం సమీపంలో, ఔటర్ రింగ్ రోడ్ సర్వీస్ రోడ్డుపై వెలసిన ఫ్లెక్సీలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ‘నీ ఏడుపే బీజేపీకి శాపం’ అంటూ ఈ ఫ్లెక్సీల్లో పేర్కొన్నారు. రాష్ట్ర అధ్యక్ష పదవి దక్కలేదని, సీఎం అభ్యర్థిగా ప్రకటించలేదని, కేంద్ర మంత్రి పదవి రాలేదని ఈటల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని ఆరోపించారు. 

రెండు నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం కల్పించడమే కాకుండా, ఎన్నికల్లో ఓటమి అనంతరం మల్కాజ్‌‌‌‌గిరి ఎంపీ టికెట్ కూడా బీజేపీయే ఇచ్చిందని గుర్తు చేశారు. ప్రధాని మోదీ నాయకత్వంలో గెలిచిన కూడా ‘నా వ్యక్తిగత ఇమేజ్‌‌‌‌తోనే గెలిచాను’ అని చెప్పడం రాజకీయ నైతికత కాదంటూ ఫ్లెక్సీల్లో విమర్శించారు. ఎంపీ ధర్మపురి అరవింద్‌‌‌‌కు లభిస్తున్న ఆదరణను చూసి అసూయ పడుతున్నారా అంటూ ప్రశ్నించారు. ఈ ఫ్లెక్సీలను ఎవరు ఏర్పాటు చేశారు? అనేది ఇంకా స్పష్టత రాలేదు.

©️ VIL Media Pvt Ltd.