Reading Time: 2 minutes

దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది రైతన్నలు ఎదురుచూస్తున్న పీఎం కిసాన్ (PM Kisan) 22వ విడత నిధుల విడుదలకు సమయం ఆసన్నమైంది. అయితే, ఈసారి అన్నదాతల ఖాతాల్లో రూ. 2,000 జమ కావాలంటే ఒక నిబంధన అడ్డుగోడలా నిలుస్తోంది. అదే ‘eKYC’. ప్రభుత్వం ఎన్నిసార్లు హెచ్చరిస్తున్నా, ఇంకా లక్షలాది మంది రైతులు ఈ ప్రక్రియను పూర్తి చేయలేదు. ఒక్క చిన్న పొరపాటు వల్ల మీ సొమ్ము నిలిచిపోయే ప్రమాదం ఉంది. ఆ వివరాలేంటో త్వరగా తెలుసుకోండి.

PM కిసాన్ 22వ విడత అప్డేట్: పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా మూడు విడతల్లో రూ. 6,000 అందిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం 22వ విడత నిధులను రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది. అయితే, గత కొన్ని విడతలుగా అనర్హులను ఏరివేసేందుకు ప్రభుత్వం నిబంధనలను కఠినతరం చేసింది. ఇందులో భాగంగానే eKYCని తప్పనిసరి చేసింది. ఈ ప్రక్రియ పూర్తి చేయని వారిని ‘అనర్హులు’గా పరిగణించి, వారి పేర్లను లబ్ధిదారుల జాబితా నుంచి తొలగిస్తున్నారు. అందుకే, మీ డబ్బులు ఆగిపోకూడదంటే వెంటనే ఈ పని పూర్తి చేయాలి.

No eKYC, No Payment! PM Kisan 22nd Installment Latest Update
No eKYC, No Payment! PM Kisan 22nd Installment Latest Update

eKYCని ముఖ్యం : చాలా మంది రైతులు తమ ఆధార్ కార్డుకు మొబైల్ నంబర్ లింక్ లేకపోవడం వల్ల లేదా సాంకేతిక కారణాల వల్ల eKYCని వాయిదా వేస్తూ వస్తున్నారు. మీరు మీ మొబైల్ ద్వారా పీఎం కిసాన్ వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఓటీపీ (OTP) ద్వారా ఈ ప్రక్రియను ఉచితంగా పూర్తి చేయవచ్చు. ఒకవేళ మొబైల్ నంబర్ లింక్ లేకపోతే, సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్ (CSC)కు వెళ్లి బయోమెట్రిక్ ద్వారా కేవలం కొన్ని నిమిషాల్లోనే KYC పూర్తి చేసే వెసులుబాటు ఉంది. ఈ చిన్న అడుగు మీ ఖాతాలోకి సకాలంలో నిధులు చేరేలా చేస్తుంది.

కేవలం eKYC మాత్రమే కాదు, ఈసారి మీ ‘ల్యాండ్ సీడింగ్’ స్థితిని కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. మీ భూమి రికార్డులు పీఎం కిసాన్ పోర్టల్‌లో అప్‌డేట్ అయ్యి ఉండాలి. అలాగే, మీ బ్యాంక్ ఖాతాకు ఆధార్ లింక్ అయి ఉందో లేదో సరిచూసుకోండి. ప్రస్తుతం ప్రభుత్వం నేరుగా నగదు బదిలీ పద్ధతిలో నిధులు విడుదల చేస్తోంది కాబట్టి, బ్యాంక్ ఖాతా మరియు ఆధార్ అనుసంధానం తప్పనిసరి. వీటిలో ఏ ఒక్కటి తప్పుగా ఉన్నా, మీ స్టేటస్‌లో ‘పేమెంట్ స్టాప్డ్ బై స్టేట్’ అని వచ్చే అవకాశం ఉంది.

నిధుల విడుదలపై అందుతున్న తాజా సమాచారం ప్రకారం, వచ్చే కొద్ది రోజుల్లోనే కేంద్రం ఒక కీలక ప్రకటన చేయనుంది. పండుగ సీజన్ లేదా పంట పెట్టుబడి సమయానికి ఈ సొమ్మును రైతుల ఖాతాల్లోకి చేర్చాలని ప్రభుత్వం భావిస్తోంది. కాబట్టి చివరి నిమిషంలో సర్వర్ సమస్యలు రాకముందే మీ eKYC స్టేటస్‌ను పీఎం కిసాన్ అధికారిక వెబ్‌సైట్‌లో సరిచూసుకోండి. రైతన్నలకు ఆర్థిక భరోసా ఇచ్చే ఈ పథకం అడ్డంకులు లేకుండా అందాలంటే నిబంధనలు పాటించడం మన బాధ్యత!

The post eKYC చేయకపోతే డబ్బు నిలిచిపోతుంది! PM కిసాన్ 22వ విడత అప్డేట్ appeared first on Manalokam – Latest Telugu News & Updates.