
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు మరోసారి ముదురుతోంది. తాజాగా మాజీ సీఎం కేజ్రీవాల్, మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, ఇతరులపై ధిక్కార కేసు నమోదు చేయాలని ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి స్వర్ణ కాంత్ ఆదేశాలు జారీ చేశారు. ఇక తాను మౌనంగా ఉండలేనని అన్నారు. సోషల్ మీడియా, ఆన్‌లైన్ వేదికలపై తనపై అభ్యంతరకరమైన, పరువు నష్టం కలిగించే కంటెంట్ పోస్ట్ చేశారని జస్టిస్ స్వర్ణకాంత మండిపడ్డారు. అటువంటి పరిస్థితుల్లో తాను మౌనంగా ఉండలేనని తెలిపారు. దీంతో కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, ఇతర నాయకులపై కోర్టు ధిక్కరణ చర్యలు ప్రారంభించాలని ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ స్వర్ణ కాంత శర్మ ఆదేశించారు.
లిక్కర్ కేసు విచారణ జరుగుతున్న సమయంలో కోర్టుకు వ్యతిరేకంగా ఒక డిజిటల్ ప్రచారం, సమాంతర కథనం సృష్టించారని… ఎడిట్ చేసిన వీడియోలు ప్రచారం చేశారని జస్టిస్ ఆరోపించారు. ‘‘వారు నన్ను భయపెట్టడానికి ప్రయత్నించారు. ఈ కోర్టుకు వ్యతిరేకంగా ఒక కల్పిత కథనం సృష్టించారు. ఇది కేవలం వ్యక్తిగత దాడి మాత్రమే కాదని, న్యాయవ్యవస్థను అస్థిరపరిచేందుకు ఉద్దేశించిన రాజ్యాంగపరమైన దాడి. ఒక అబద్ధాన్ని వెయ్యిసార్లు చెప్పినంత మాత్రాన అది నిజం కాదు. నా మౌనాన్ని బలహీనతగా భావిస్తున్నారు. ఒక సంస్థ విచారణకు గురైనప్పుడు, అటువంటి ఆరోపణల ప్రభావానికి కోర్టు గురికాకుండా చూడటం న్యాయమూర్తి విధి.’’ అని జస్టిస్ శర్మ అన్నారు.
కేజ్రీవాల్ చేసిన ట్వీట్‌ను స్వర్ణ కాంత శర్మ ప్రస్తావించారు. ఆ ట్వీట్‌లో కేజ్రీవాల్ న్యాయమూర్తికి ఒక లేఖ రాసి.. వీడియోను విడుదల చేశారు. న్యాయమూర్తి శర్మ.. కేజ్రీవాల్ పేరును ప్రస్తావిస్తూ.. కోర్టు నిర్ణయాన్ని నిరసించేందుకు కోర్టు గదిలోని ఒక వీడియోను ఎడిట్ చేసి సోషల్ మీడియాలో ప్రచారం చేశారని అన్నారు. ఆ లేఖ, వీడియో, సోషల్ మీడియా ప్రచారం విస్తృతంగా వ్యాప్తి చెందాయని కోర్టు అభిప్రాయపడింది. ఇది ఒక పక్కా ప్రణాళికతో కూడిన ప్రచారంగా కోర్టు పేర్కొంది. సోషల్ మీడియా, ఆన్‌లైన్ వేదికలపై తనపై అభ్యంతరకరమైన, పరువు నష్టం కలిగించే వ్యాఖ్యలు పోస్ట్ చేశాక.. అటువంటి పరిస్థితుల్లో తాను మౌనంగా ఉండలేకపోయానని స్వర్ణ కాంత శర్మ వ్యాఖ్యానించారు.
ఫిబ్రవరి 27న ఢిల్లీ లిక్కర్ కేసులో నిందితులను నిర్దోషులుగా తేలుస్తూ ట్రయల్ కోర్టు తీర్పు ఇచ్చింది. అయితే ఈ తీర్పును సవాల్ చేస్తూ సీబీఐ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అయితే ఈ పిటిషన్ విచారణ జస్టిస్ స్వర్ణ కాంత శర్మ దగ్గరకు వెళ్లింది. అయితే ఆమె ఆర్ఎస్ఎస్ భావజాలు కలిగిన న్యాయమూర్తి.. ఆమె నుంచి పిటిషన్ తప్పించాలని కేజ్రీవాల్, సిసోడియా పిటిషన్ వేశారు. అయితే ఈ పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది. అనంతరం న్యాయస్థానానికి కేజ్రీవాల్, సిసోడియా లేఖ రాశారు. లాయర్ ద్వారా గానీ.. వ్యక్తిగతంగానీ ఆమె ముందు హాజరు కాబోమని స్పష్టం చేశారు. చివరికి న్యాయమూర్తి.. ధిక్కార కేసు కింద చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు. దీనిపై ఆమ్ ఆద్మీ పార్టీ ఎలా స్పందిస్తుందో చూడాలి.
Delhi High Court’s Justice Swarana Kanta Sharma initiates criminal contempt proceedings against Arvind Kejriwal over alleged defamatory letters, videos and social media posts targeting the judge and the judiciary. Contempt action has also been initiated against Manish Sisodia,…
— ANI (@ANI) May 14, 2026